Share News

Flood Alerts: నేడు, రేపు వర్షాలు.. ఉత్తరాంధ్రలో భారీగా

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:24 AM

ఉత్తర కోస్తా, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో శుక్రవారం కోస్తా, సీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.

 Flood Alerts: నేడు, రేపు వర్షాలు.. ఉత్తరాంధ్రలో భారీగా

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఉత్తర కోస్తా, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో శుక్రవారం కోస్తా, సీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉద యం వరకు అక్కడక్కడా భారీవర్షాలు కురవనున్నాయి. శని, ఆదివారాలు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, బంగ్లాదేశ్‌, దానికి ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో గాలుల దిశ మారుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. శనివారం అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూ రు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం సాయంత్రం వరకు కోనసీమ జిల్లా నగరంలో 46, మలికిపురంలో 36, ప్రకాశం జిల్లా నర్సింగోలులో 27, కాకినాడజిల్లా డీ-పోలవరంలో 25.2 మిల్లీమీటర్ల వాన పడింది.

Updated Date - Oct 11 , 2025 | 05:25 AM