భారీ వర్షం
ABN , Publish Date - May 21 , 2025 | 12:47 AM
జిల్లావ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8.30 గంటల వరకు వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా పమిడిముక్కలలో 87.2 మిలీ ్లమీటర్లు, అత్యల్పంగా గన్నవరంలో 10.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 44.3 మిల్లీమీటర్లుగా ఉంది. కోస్తాతీరం వెంబడి రానున్న రెండు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, పోలీస్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
- అత్యధికంగా పమిడిముక్కలలో 87.2 మిల్లీమీటర్ల వర్షపాతం
- అత్యల్పంగా గన్నవరంలో 10.2 మిల్లీ మీటర్లు నమోదు
- మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం
- జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ
ఆంఽధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లావ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8.30 గంటల వరకు వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా పమిడిముక్కలలో 87.2 మిలీ ్లమీటర్లు, అత్యల్పంగా గన్నవరంలో 10.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 44.3 మిల్లీమీటర్లుగా ఉంది. కోస్తాతీరం వెంబడి రానున్న రెండు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, పోలీస్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
రహదారులు జలమయం
భారీ వర్షంతో మచిలీపట్నం, గుడివాడ, పెడన, ఉయ్యూరు, నందివాడ, అవనిగడ్డ, నాగాయలంక తదితర ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభం కాగానే అన్ని ప్రాంతాల్లో విద్యుత సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుడివాడ తదితర ప్రాంతాల్లో సాయంత్రం వరకు విద్యుత సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వ్యవసాయానికి అనుకూలం
మరో పది రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు దుక్కులకు అనుకూలంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. దుక్కులు పూర్తి చేస్తే భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను పొలంలో చల్లేందుకు అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. జూన్ ప్రారంభం నాటికి రుతుపవనాలు ప్రవేశించి, మరింతగా వర్షాలు కురిస్తే వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా మారుతుందనే ఆశతో రైతులు ఉన్నారు. కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు, చల్లపల్లి, మొవ్వ తదితర ప్రాంతాల్లో బోరు నీటి ఆధారంగా ముందస్తుగానే నారుమడులు పోసుకుంటామని రైతులు అంటున్నారు.
జిల్లాలో నమోదైన వర్షపాతం ఇలా
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చల్లపల్లి ఆ్‌లి 71.8 మిల్లీమీటర్లు, మోపిదేవి 70.2, ఘంటసాల 69.2, పామర్రు 60.6, అవనిగడ్డ 57.4, మచిలీపట్నం 54.2, గుడ్లవల్లేరు 52.6, మొవ్వ 50.8, నాగాయలంక 50.8, గుడివాడ 49.4, ఉయ్యూరు 48.2, బంటుమిల్లి 46.2, కంకిపాడు 44.2, పెదపారుపూడి 43.2, గూడూరు 36.0, నందివాడ 32.4, కోడూరు 31.2, పెనమలూరు 29.4, పెడన 28.8, తోట్లవల్లూరు 26.6, కృత్తివెన్ను 18.2, బాపులపాడు 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.