DJ Sound Tragedy: డీజే హోరుతో ఆగిన గుండె
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:30 AM
దసరా వేడుకల్లో దుర్గాదేవి విగ్రహ నిమజ్జనోత్సవం సందర్భంగా ఏర్పా టు చేసిన డీజే హోరుకు ఓ వ్యక్తి గుండె ఆగిపోయింది.
దుర్గా నిమజ్జనోత్సవంలో అపశ్రుతి
పెందుర్తి (విశాఖపట్నం), అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దసరా వేడుకల్లో దుర్గాదేవి విగ్రహ నిమజ్జనోత్సవం సందర్భంగా ఏర్పా టు చేసిన డీజే హోరుకు ఓ వ్యక్తి గుండె ఆగిపోయింది. వివరాలివీ.. విశాఖ జిల్లా పెందు ర్తి మండలం పెదగాడిలో ఆదివారం రాత్రి దుర్గాదేవి విగ్రహ నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. ఊరేగింపులో డీజే సౌండ్స్ ఏర్పాటు చేయగా యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ అప్పికొండ త్రినాథ్(56), అతడి భార్య లక్ష్మి ఓ పాటకు సరదాగా డ్యాన్స్ చేశారు. పాట ముగిసిన వెంటనే పక్కకు వచ్చి, అరుగు మీద కూర్చుని త్రినాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడివారు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. త్రినాథ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.