Share News

ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: సత్యకుమార్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:01 AM

లిక్కర్‌ స్కాంలో ఎంత మందికి లింకులు ఉన్నాయో సిట్‌ విచారణలో మొత్తం బయటకు వస్తాయని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ అన్నారు.

ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: సత్యకుమార్‌

గుంటూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కాంలో ఎంత మందికి లింకులు ఉన్నాయో సిట్‌ విచారణలో మొత్తం బయటకు వస్తాయని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం విక్రయాలు జరిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడి కోట్లు కొల్లగొట్టారని పేర్కొన్నారు. మద్యం స్కాంలో దోషులెవ్వరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సమయానికి ఆస్పత్రిలో ఉండకపోతే వారికి మెమో జారీ చేస్తున్నామని చెప్పారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారికి ఎన్‌ఎంసీ గైడ్‌ లైన్స్‌, కోర్టు తీర్పులనుసరించి తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Updated Date - Jul 21 , 2025 | 05:02 AM