Minister Satyakumar: సంతానోత్పత్తి కేంద్రాలపై దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:49 AM
ష్ట్రంలో సంతానోత్పత్తి సేవలందిస్తున్న కేంద్రాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర నివేదిక అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు.
మంత్రి సత్యకుమార్
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంతానోత్పత్తి సేవలందిస్తున్న కేంద్రాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర నివేదిక అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఫెర్టీలిటీ సెంటర్‌లో అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీచేశారు. కాగా, ఎన్టీఆర్ జల్లా డిఎంహెచ్‌వో డాక్టర్ సుహాసిని తమ బృందంతో కలిసి విజయవాడలోని యూనివర్సల్ హెల్త్‌కేర్ సెంటర్‌కు తనిఖీకి వెళ్లగా అది మూసి ఉన్నట్టు మంత్రి కార్యాలయానికి తెలిపారు. హైదరాబాద్‌లో అక్రమాల ఆరోపణలతో అరెస్టయిన డాక్టర్ నమ్రత పేరుమీదే ఈ ఫెర్టిలిటీ సెంటర్ మంజూరై ఉంది.