Minister Satya kumar: 15 ఆస్పత్రుల్లో ఎన్‌ఆర్సీల ఏర్పాటు
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:34 AM
రాష్ట్రంలోని 15 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో న్యూ ట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లు(ఎన్‌ఆర్సీ) ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 15 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో న్యూ ట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లు(ఎన్‌ఆర్సీ) ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీచేశారు. ఈ కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు వైద్య, పోషకాహార సేవలందుతాయన్నారు. 15 ఎన్‌ఆర్సీల్లో 11 గిరిజన ప్రాంతాల్లో వస్తాయని పేర్కొన్నారు. వీటన్నింటిలో చిన్నారుల కోసం 115 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 21 ఎన్‌ఆర్సీలు ఉన్నాయని, వాటిల్లో 340 పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గ్రామాల్లోని ఆశా, ఎఎన్‌ఎంలు అందించే సమాచారంతో పీహెచ్‌సీ వైద్యులు చిన్నారులకు పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఎన్‌ఆర్సీ కేంద్రాలకు పంపిస్తారని పేర్కొన్నారు.