Share News

చెత్తకుప్పలో హెల్త్‌ క్లినిక్‌ మందులు

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:07 AM

ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఉన్న చెత్తకుప్పలో ప్రభుత్వం సరఫరా చేసే మందులు, సిరఫ్‌లు అగ్నికి ఆహుతయ్యాయి.

చెత్తకుప్పలో హెల్త్‌ క్లినిక్‌ మందులు
నిప్పులో కాలిన ప్రభుత్వం సరఫరా చేసిన మందులు

విచారణ చేపట్టిన వైద్యాధికారి

ప్రొద్దుటూరు రూరల్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఉన్న చెత్తకుప్పలో ప్రభుత్వం సరఫరా చేసే మందులు, సిరఫ్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో గ్రామీణ ప్రజలకు అందాల్సిన ఔషదాలు చెత్తలో కలిసి నిప్పంటుకున్నాయి. విషయం తెలుసుకున్న కల్లూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీటికి ఇంకా ఈ ఏడాది అక్టోబరు, సెప్టెంబరు వరకు ఎక్స్‌పెయిరీ డేట్‌ ఉంది. అయినప్పటికి ఇలా చెత్తకుప్పలో తగలబడుతూ దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలిసిన కల్లూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిప్పులో మందులు కొన్ని పూర్తిగా కాలిపోగా మరికొన్ని పాక్షికంగా కాలాయి. ఘటనపైన ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు డాక్టర్‌ సుమన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 12:07 AM