Share News

High Court: పరకామణిలో చోరీపైచట్టపరంగా చర్యలు

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:51 AM

తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ వ్యవహారంలో చట్టప్రకారం చర్యలు చేపట్టాలని సీఐడీ, ఏసీబీ డీజీపీల ను హైకోర్టు ఆదేశించింది...

High Court: పరకామణిలో చోరీపైచట్టపరంగా చర్యలు

  • సీఐడీ, ఏసీబీకి హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ వ్యవహారంలో చట్టప్రకారం చర్యలు చేపట్టాలని సీఐడీ, ఏసీబీ డీజీపీల ను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చేస్తున్న దర్యాప్తులను కొనసాగించాలని.. కేసును సమర్థంగా విచారించేందుకు.. సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని నిర్దేశించింది. దర్యాప్తు వివరాలను అవసరమైన మేరకు ఐటీ, ఈడీతో పంచుకోవాలని స్పష్టంచేసింది. అప్పటి టీటీడీ ఏవీఎ్‌సవో వై.సతీశ్‌కుమార్‌ పోస్టుమార్టం సర్టిఫికెట్‌ ప్రతిని మూడ్రోజుల్లో సీల్డ్‌ కవర్‌ లో రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌)కు అందజేయాలని సీఐడీని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ బుధవా రం ఉత్తర్వులు ఇచ్చారు. పరకామణిలో జరిగిన చోరీ కి సంబంధించిన నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023, సెప్టెంబరు 9న లోక్‌ అదాలత్‌ వద్ద ఏవీఎ్‌సవో సతీశ్‌కుమార్‌.. నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించడం.. చోరీకి పాల్పడిన రవికుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల స్థిర-చరాస్తులు, బ్యాంకు ఖాతాల ను పరిశీలించడంతో పాటు.. వాటిని ఆదాయానికి తగినట్లే ఆర్జించారా అనే కోణంలో లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీని నిర్దేశించడం.. దర్యాప్తు చేసిన సీఐడీ, ఏసీబీ డీజీలు వేర్వేరుగా నివేదికలను సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందుంచడం.. సీఐడీ దాఖలు చేసి న అదనపు నివేదికను సైతం పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి మంగళవారం ప్రకటించారు. బుధవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. ఆ నివేదికలను పరిశీలించారు. అంతకుముందు ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు స్వా మి శ్రీనివాసానంద సరస్వతి తరఫు సీనియర్‌ న్యా యవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. పరకామణి చోరీ కేసు మొత్తం దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తే సబబుగా ఉంటుందన్నారు. ఒకే కేసును రెండు వేర్వేరు సంస్థలు దర్యాప్తు చేయడం వల్ల సమన్వయ లోపం తలెత్తే అవకాశం ఉందన్నా రు. కేసు దర్యాప్తు మొత్తాన్ని సీఐడీకి అప్పగించేలా ఆదేశాలివ్వాలని కోరగా.. కోర్టు తోసిపుచ్చింది.

Updated Date - Dec 11 , 2025 | 03:51 AM