Minister Savitha: చేనేత, గిరిజన ఉత్పత్తులన్నీ ఒకేచోట
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:55 AM
చేనేత వస్త్రాలు.. హస్త కళలు.. గిరిజన ఉత్పత్తులు.. అన్నీ ఒకే చోట లభించేలా దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో వాణిజ్య సముదాయాలు...
దేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు: మంత్రి సవిత
అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): చేనేత వస్త్రాలు.. హస్త కళలు.. గిరిజన ఉత్పత్తులు.. అన్నీ ఒకే చోట లభించేలా దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో వాణిజ్య సముదాయాలు(ఎగ్జిబిషన్లు) ఏర్పాటు చేయబోతున్నట్లు చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా డిసెంబరు 20నుంచి 2026 జనవరి 10వరకు.. 22రోజుల పాటు ఎగ్జిబిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు, లేపాక్షిలోని హస్తకళాఖండాలు, అరకు కాఫీతో కూడిన ఇతర ఉత్పత్తులు ఒకే ఆవరణలో లభించేలా చర్యలు చేపట్టి ఆయా వర్గాలకు భరోసా ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. దేశంలోనే తొలిసారిగా మన స్థానిక ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి సవిత తెలిపారు.