Share News

చేనేతలు, కళాకారులకు ప్రోత్సాహం: సిసోడియా

ABN , Publish Date - Jul 16 , 2025 | 04:55 AM

రాష్ట్రంలోని చేనేతలు, కళాకారుల ప్రతిభకు చంద్రబాబు ప్రభు త్వం ఇస్తున్న ప్రోత్సాహం, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత కృషి వలన ఏపీకి జాతీయస్థాయిలో గౌరవం దక్కిందని...

చేనేతలు, కళాకారులకు ప్రోత్సాహం: సిసోడియా

అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చేనేతలు, కళాకారుల ప్రతిభకు చంద్రబాబు ప్రభు త్వం ఇస్తున్న ప్రోత్సాహం, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత కృషి వలన ఏపీకి జాతీయస్థాయిలో గౌరవం దక్కిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా అన్నారు. రాష్ట్రానికి పది ఓడీఓపీ అవార్డులు రావడం గర్వకారణమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి (ఓడీఓపీ)’ కింద గుర్తింపు పొందేలా సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన చేనేత, హస్తకళా, వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం ప్రకటించిన అవార్డులను ఢిల్లీలో సోమవారం ప్రదానం చేశారు. ఈ అవార్డుల స్వీకరణ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ మంత్రి మంత్రి సవిత, ప్రత్యేక సీఎస్‌ సిసోడియా, కమిషనర్‌ రేఖారాణి, ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 04:55 AM