Share News

ఇంటర్‌ సప్లిమెంటరీలో సగం మంది ఫెయిల్‌

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:43 AM

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో సగం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. కృష్ణాజిల్లా 60 శాతం, ఎన్టీఆర్‌ జిల్లా 48 శాతం ఉత్తీర్ణతను సాధించింది.

ఇంటర్‌ సప్లిమెంటరీలో సగం మంది ఫెయిల్‌

- కృష్ణా - 60, ఎన్టీఆర్‌ - 48 శాతం ఉత్తీర్ణత

విజయవాడ, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో సగం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. కృష్ణాజిల్లా 60 శాతం, ఎన్టీఆర్‌ జిల్లా 48 శాతం ఉత్తీర్ణతను సాధించింది. కృష్ణాజిల్లా నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు 2,968 మంది హాజరవ్వగా 1,477 మంది ఉత్తీర్ణులయ్యారు. 51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,832 మంది హాజరవ్వగా, 1,095 మంది ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎన్టీఆర్‌ జిల్లాలో మొదటి ఏడాది పరీక్షలకు 6,617 మంది హాజరవ్వగా 3,044 మంది ఉత్తీర్ణులవ్వడంతో 46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 4,676 మంది హాజరవ్వగా, 2,233 మంది ఉత్తీర్ణులయ్యారు. 48 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Updated Date - Jun 08 , 2025 | 12:43 AM