Share News

హజ్‌ యాత్ర దరఖాస్తు గడువు పెంపు: మంత్రి ఫరూక్‌

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:35 AM

హజ్‌ యాత్ర కోసం హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా హజ్‌-2026కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్టు...

హజ్‌ యాత్ర దరఖాస్తు గడువు పెంపు: మంత్రి ఫరూక్‌

అమరావతి/విజయవాడ సిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): హజ్‌ యాత్ర కోసం హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా హజ్‌-2026కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్టు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. దరఖాస్తు చేసేటపుడు మొదటి ప్రాధాన్యతగా విజయవాడ ఎంబార్కేషన్‌ సెంటర్‌ను ఎంచుకోవాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. విజయవాడ ఎంబార్కేషన్‌ సెంటర్‌ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు కూటమి ప్రభుత్వం రూ.లక్ష ఆర్ధిక సాయం అందజేస్తుందని వివరించారు.

Updated Date - Aug 01 , 2025 | 04:36 AM