Share News

Haj Vaccination Alert for AP Pilgrims: హజ్‌ యాత్రికులకు 15 రోజుల ముందే టీకాలు

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:30 AM

హజ్‌ యాత్రికులు తమ యాత్రకు కనీసం 15 రోజుల ముందే టీకాలు వేయించుకోవాలని రాష్ట్ర హజ్‌ కమిటీ సూచించింది. జిల్లాల హజ్‌ సొసైటీలు ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలిచ్చింది

Haj Vaccination Alert for AP Pilgrims: హజ్‌ యాత్రికులకు 15 రోజుల ముందే టీకాలు

  • జిల్లా సొసైటీలు ఏర్పాట్లు చేయాలి: రాష్ట్ర హజ్‌ కమిటీ

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హజ్‌ యాత్రికులు తమ యాత్రా తేదీకి కనీసం 15 రోజులు ముందుగా టీకాలు వేయించుకునేలా అన్ని జిల్లాల హజ్‌ సొసైటీలు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హజ్‌ కమిటీ కోరింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదేశాల ప్రకారం రాష్ట్రానికి చెందిన హజ్‌ యాత్రికులకు ఎలాంటి అంతరాయమూ లేకుండా టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌, రాష్ట్ర ఇమ్యూనైజేషన్‌ అధికారిని కోరామని వెల్లడించింది.

Updated Date - Apr 11 , 2025 | 05:30 AM