Share News

దొంగతనాలతో హడల్‌..

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:14 AM

నంద్యాల జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

   దొంగతనాలతో హడల్‌..
తెలుగు పేటలో జరిగిన దొంగతనం

ఎక్కువగా వనటౌన ప్రాంతంలో చోరీలు

రికవరీ సరిగా లేకపోవడంతో ప్రజలు ఆందోళన

నంద్యాల టౌన, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో నిరంతరం పోలీసు గస్తీ సరిగా లేకపోవడంతో ఈ ఘటనలు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రధాన పట్టణాల్లో, పలు కాలనీలు నివాస ప్రాంతాలు, దుకాణాలే లక్ష్యంగా దొంగలు వరుస దాడులకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో భధ్రత ఎలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోను పలు చోట్ల దొంగతనాలు జరిగి ఇప్పటికి పూర్థిస్థాయిలో రికవరీలు లేకపోవడంతో పోలీసు శాఖ పనితీరుపై ప్రశ్నార్థకంగా మారింది.

కేసుల నమోఎదు ఇలా...

ఏడాది కేసులు చేదించినవి

2024 179 కేసులు 89

2025 154 జూన నాటికి 96

గస్తీ సరిగా లేకపోవడంతో...

జిల్లాలో ఎక్కడా కూడా సరిగా గస్తీ లేకపోవడమే దొంగతనాలకు కారణమని పలువురు అంటున్నారు. నంద్యాల పట్టణ శివారుల్లో అవుట్‌ పోస్టులు ఉన్న అక్కడ పోలీసు సిబ్బంది కనిపించడం లేదు. నూనెపల్లె, చెరువుకట్ట వద్ద, బొమ్మలసత్రం, రైతునగరం వంటి పలు ప్రాంతాల్లో సరిగా లేదు. అలాగే ఎక్కువగా వన టౌన ప్రాంతంలో ఇటీవల వరుస దొంగతనాలు జరిగాయి. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

కే సులు నమోదు చేయకపోవడంతో....

చోరీలపై ఫిర్యాదులు అందిన పోలీసులు సక్రమంగా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇళ్లు, దుకాణాలు మహిళలు, వాహనాలు లక్ష్యంగా చేసుకుని కొల్లగొడుతున్నారు. వాహనాలు, గొర్రెలు, చోరీలు అందిన కేసులు నమోదు చేయకపోవడంతో పాటు కనీసం విచారణ సైతం చేయకపోవడంతో పలు విమర్శలు ఉన్నాయి. చోరీల నియంత్రణ పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాగే అవుకు మండలం పరిఽధిలో ఒక గ్రామంలో గత మూడు నెలల క్రితం చోరీ జరిగితే బాధితులు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడంతో బాధితులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు చేశారు. ఇలాంటి సంఘటనే మహానంది మండలంలో కూడా చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చోరీ కేసుల్లో రికవరీ లేదనే విమర్శ కూడా ఉంది

జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు

,..............................................................................................

ఫ నందమూరి నగర్‌కు చెందిన ఒక వ్యక్తి కూరగాయలకు నంద్యాల గాంఽధీచౌక్‌కు వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి డబ్బులు లాక్కొని పోయారు. ఇంత వరకు ఫిర్యాదు చేయలేదు.

ఫ డిసెంబరులో తెలుగుపేటలో ఒక్క రోజే మూడు ఇళ్లల్లో చోరి జరిగింది. సుమారుగా 9 తులాల బంగారు అభరణాలు, వెండి వస్తువులు, చోరీ చేశారు.

ఫ రైతు నగరం వద్ద ఉన్న కాలనీలో మహిళ పట్టణంలోకి వచ్చి ఇంటికి వెళ్లే సమయంలోపే గుర్తు తెలియని వ్యక్తులు బంగారు అభరణాలు చోరి చేశారు.

ఫ రైతు నగరం వద్ద ఉన్న సాయి కాలనీలో ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సుమారుగా 20 తులాల బంగారం, డబ్బులు చోరీ చేశారు.

ఫ పట్టణ శివారు ప్రాంతాలైన నందమూరి నగర్‌, వైఎస్‌ నగర్‌లో పలు దొంగతనాలు జరుగుతున్నాయి.

ఫ అవుకు మండలం అన్నారం గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు బీరువా పగలగొట్టి రూ.1 లక్ష , 12 తులాల బంగారం దొంగిలించారు.

ఫ నంద్యాల పట్టణంలోని భైర్మల్‌ వీధిలో ఏకంగా బంగారు దుకాణంలోనే చోరికి పాల్పడి సొమ్మును ఎత్తుకెళ్లారు.

ఫ నంద్యాల ఆర్టీసీ బస్టాండులో ఒక మహిళ పెళ్లికి వెళ్తూ బ్యాకులో బంగారు పెట్టుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు సుమారుగా 8 తులాల బంగారు అభరణాలు చోరీ చేశారు.

ఫ తెలుగు పేట వద్ద డోనకు చెందిన మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు లాక్కుని వెళ్లారు.

ఫ ఇటీవల పద్మావతి నగర్‌లోని జ్యూవెలనీ దుకాణంలో బంగార ం గుర్తు తెలియకుండా పోయింది. వాటిలో చాలా మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి రికవరీ చేశామని చెబుతున్నారు. కానీ అది ఎంత వరకు నిజం అన్నది ఇప్పటికి ప్రశ్నార్థకంగా ఉంది.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం

మందా జావళి, ఏఎస్పీ నంద్యాల

దొంగతనాలకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశాం. రికవరీ శాతం కూడా పెంచుతున్నాం. దొంగతనాలు కూడా దొంగలు కాకుండా అవసరాన్ని బట్టి చేస్తున్నారు. చాలా మంది దొంగలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపి న్యాయం చేస్తాం.

Updated Date - Dec 24 , 2025 | 12:14 AM