మల్లన్న సన్నిధిలో ఙ్ఞానేష్ కుమార్
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:48 PM
ద్వాదశ జ్యోతిర్లింగం శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భారత ఎన్నికల ప్రధాన కమిషనరు ఙ్ఞానేష్ కుమార్, అనురాధ కుమార్ దంపతులకు శుక్రవారం ప్రధాన రాజ గోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో అర్చక వేదపండితులు విభూది తిలక ధారణ చేసి పూలమాలలతో స్వాగతం పలికారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ దంపతులకు ఘన స్వాగతం
శ్రీశైలం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ద్వాదశ జ్యోతిర్లింగం శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భారత ఎన్నికల ప్రధాన కమిషనరు ఙ్ఞానేష్ కుమార్, అనురాధ కుమార్ దంపతులకు శుక్రవారం ప్రధాన రాజ గోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో అర్చక వేదపండితులు విభూది తిలక ధారణ చేసి పూలమాలలతో స్వాగతం పలికారు. కమిషనరు వెంట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ దంపతులు, కలెక్టర్ రాజకుమారి ఐఏఎస్, ఎస్పీ సునీల్ షరాన ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, డీఎస్పీ రామాంజినాయక్ ఉన్నారు. ఆలయ ప్రవేశం చేసిన వీరు ధ్వజస్తంభ నమస్కారం చేసుకుని రత్నగర్భ గణపతికి పుష్పార్చనలు చేసుకున్నారు. అనంతరం స్వామివారికి గర్భాలయంలో పూజలు చేసి, నందీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ ఉత్తర భాగంలో ఉన్న మల్లికా గుండం వద్ద స్వామివారి గర్భాలయ గోపుర త్రిశూల దర్శనం చేసుకుని శ్రీచక్రానికి పూజలు చేశారు. అమ్మవారి ప్రాకార మండపంలో వేదపండితులు వారిని ఆశీర్వదించారు.