Horse Rider: గుర్రం లక్ష్మారెడ్డి
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:13 AM
ఆరు పదుల వయస్సు.. పంచెకట్టు.. గుర్రంపై దర్జాగా స్వారీ! సోమవారం గుంటూరు జిల్లా తెనాలి రోడ్లపై ఓ వ్యక్తి బైకులు, కార్లను దాటుకొని ముందుకు దూసుకుపోవడం అందరిదృష్టినీ ఆకర్షించింది.
30 ఏళ్లుగా అశ్వమే వాహనం!
ఆరు పదుల వయస్సు.. పంచెకట్టు.. గుర్రంపై దర్జాగా స్వారీ! సోమవారం గుంటూరు జిల్లా తెనాలి రోడ్లపై ఓ వ్యక్తి బైకులు, కార్లను దాటుకొని ముందుకు దూసుకుపోవడం అందరిదృష్టినీ ఆకర్షించింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం కారుమూరువారిపాలెం గ్రామానికి చెందిన ఆయన పేరు లక్ష్మారెడ్డి (61). పాలసీ సొమ్ము చెల్లించేందుకు స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయానికి గుర్రంపై వచ్చి ఇలా కనిపించారు. బైక్‌ల కంటే గుర్రంపై స్వారీనే మేలని చెబుతున్న ఆయన.. 30 ఏళ్లకు పైగా తన ప్రయాణాలకు దాన్నే వినియోగిస్తున్నారట! పొలానికి వెళ్లాలన్నా, ఇతర గ్రామాలకు వెళ్లాలన్నా ఇదే ఆయన వాహనం!! రాజధాని ప్రాంత గ్రామాలకు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంధువులవద్దకు సైతం గుర్రంపైనే వెళ్తానని, ఇప్పటికి 10 గుర్రాలను మార్చానని చెబుతున్నారు. తన ప్రయాణ అవసరాల కోసం గుర్రం బండి తయారు చేయించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
- తెనాలి-ఆంధ్రజ్యోతి