Share News

Guntur: నేడు, రేపు మిర్చి యార్డుకు సెలవులు

ABN , Publish Date - Oct 28 , 2025 | 05:44 AM

తుపాను ప్రభావం దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈ నెల 28, 29 తేదీ (మంగళ, బుధవారం)ల్లో గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ...

Guntur: నేడు, రేపు మిర్చి యార్డుకు సెలవులు

  • గుంటూరు రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌డెస్కు ఏర్పాటు

తుపాను ప్రభావం దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈ నెల 28, 29 తేదీ (మంగళ, బుధవారం)ల్లో గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (మిర్చియార్డు)కి సెలవులు ప్రకటించినట్లు జీఏఎంసీ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఏ చంద్రిక తెలిపారు. తుఫాను కారణంగా జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే, ఈస్టు కోస్టు రైల్వే జోన్‌లు పలు రైళ్లను రద్దు చేశాయి. సోమవారమే కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ సాయంత్రానికి వాటిల్లో కొన్నింటిని పునరుద్ధరించారు. రైళ్ల రద్దు దృష్ట్యా గుంటూరు రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌డెస్కుని ఏర్పాటు చేశారు.

Updated Date - Oct 28 , 2025 | 05:44 AM