Share News

Gun Misfire: ఐఎన్‌ఎస్‌ కళింగలో గన్‌ మిస్‌ఫైర్‌

ABN , Publish Date - Oct 05 , 2025 | 04:06 AM

విశాఖపట్నం జిల్లా భీమిలి బీచ్‌ రోడ్డులో నేరేళ్లవలస వద్ద ఉన్న ఐఎన్‌ఎస్‌ కళింగ(నౌకా కేంద్రం)లో గన్‌ మిస్‌ ఫైర్‌ కావడంతో సెక్యూరిటీ గార్డు మృతి చెందారు....

Gun Misfire: ఐఎన్‌ఎస్‌ కళింగలో గన్‌ మిస్‌ఫైర్‌

  • గుంటూరు జిల్లాకు చెందిన గార్డు మృతి

భీమునిపట్నం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమిలి బీచ్‌ రోడ్డులో నేరేళ్లవలస వద్ద ఉన్న ఐఎన్‌ఎస్‌ కళింగ(నౌకా కేంద్రం)లో గన్‌ మిస్‌ ఫైర్‌ కావడంతో సెక్యూరిటీ గార్డు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ బాజీ బాబా(44) ఐఎన్‌ఎ్‌స కళింగలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తూ గన్‌ మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాజీని కళింగలోనే ఉన్న ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నేవల్‌ ఆఫీసరు వికాస్‌ కుమార్‌ పోలీసులకు సమాచారం అందించడంతో నార్త్‌ ఏసీపీ అప్పలరాజు, భీమిలి సీఐ తిరుమలరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

.

Updated Date - Oct 05 , 2025 | 04:06 AM