Share News

Deputy CM Pawan Kalyan: ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకం

ABN , Publish Date - Sep 19 , 2025 | 05:20 AM

జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Deputy CM Pawan Kalyan: ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకం

  • ఆర్థిక ఆటుపోట్లున్నా దేశ ప్రగతి కోసం మద్దతు

  • అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర్చే చారిత్రక నిర్ణయం ఇది. 140 కోట్ల మంది ప్రజలకు మేలు చేసే ఈ సంస్కరణలకురాష్ట్రం నిర్మాణాత్మక సహకారం అందించడం గర్వకారణం. రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లినా సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ సంస్కరణలను బలంగా సమర్థించాలని సీఎం చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక ఆటుపోట్లున్నా దేశం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్కరణలు వ్యాపారాలను సులభతరం చేస్తాయి. పన్ను వ్యవస్థల్లో పారదర్శకత పెంచుతాయి. పరిశ్రమల అభివృద్ధికి, ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయి. కొత్త పెట్టుబడులు ఆకర్షిస్తాయి. స్థిరమైన వృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తాయి. వ్యవసాయ రంగంలో వాడే ఎరువులు, యంత్రాల రేట్లు తగ్గడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజల వృద్ధి చెందుతారు.పాలు, పెరుగు, వెన్న, సబ్బులు, షాంపూలపై పన్నులు తగ్గడంతో కుటుంబ బడ్జెట్లు తగ్గుతాయి. సిమెంటు రేట్లు తగ్గడం వల్ల గృహనిర్మాణ వ్యయాలు తగ్గి, అమ్మకాలు పెరుగుతాయి. అత్యవసర మందులపై పన్ను సున్నాశాతం చేయడంతో ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. బీమా ప్రీమియంపై పన్ను ఎత్తేయడం ప్రజలకు మేలుచేస్తుంది.’ అని పవన్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 05:20 AM