జీఎస్టీ రేట్లను అమలు చేయాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:02 AM
పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం ఇటీవల తగ్గించిన జీఎస్టీ రేట్లను ప్రతి వ్యాపారి కచ్చితంగా అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి కోరారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం ఇటీవల తగ్గించిన జీఎస్టీ రేట్లను ప్రతి వ్యాపారి కచ్చితంగా అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాహితమైదన్నారు. తగ్గిన రేట్ల ప్రకారం వస్తువులు అమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సమీక్షించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాలు, పట్టణాల్లో జీఎస్టీపై అవగాహన కల్పించాలని సూచించారు. తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రకారం విక్రయాలు జరగాలని కేంద్ర నిర్ణయాన్ని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తే సహించమని అభిరుచి మధు హెచ్చరించారు.