Share News

Daspalla Hotel: అమరావతిలో దసపల్లాకు భూమిపూజ

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:29 AM

రాజధాని అమరావతిలోని శాఖమూరు-నేలపాడు సమీపంలో దసపల్లా 4 స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి దసపల్లా అమరావతి హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మంగళవారం భూమి పూజ చేసింది.

Daspalla Hotel: అమరావతిలో దసపల్లాకు భూమిపూజ

  • 200 కోట్లు పెట్టుబడి.. 400 మందికి ఉపాధి

  • వర్చువల్‌గా పాల్గొన్న సీఎం చంద్రబాబు

తుళ్లూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని శాఖమూరు-నేలపాడు సమీపంలో దసపల్లా 4 స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి ‘దసపల్లా అమరావతి హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ మంగళవారం భూమి పూజ చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. సుమారు రూ.200 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 400 మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ చైర్మన్‌, ఎండీ మండవ రాఘవేంద్రరావు తెలిపారు. 2029 నాటికి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఏపీ టూరిజం అఽథారిటీ సీఈవో, ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ అమ్రాపాలి కాటా, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, గుంటూరు జిల్లా జేసీ అశుతోష్‌ శ్రీవాస్తవ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే సీఎం చంద్రబాబు లక్ష్య సాధనలో భాగంగా దసపల్లా హోటల్‌కు భూమి పూజ చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 04:30 AM