వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:00 PM
ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న ప్రధాన కూడలిలో మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు భూమిపూజ చేశారు.
నంద్యాల నూనెపల్లె, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న ప్రధాన కూడలిలో మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 13న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారతదేశానికి ఎన్నో సంస్కరణలు చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసులు, బిజ్జం సుబ్బారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.