Share News

గ్రీన్‌ విలేజ్‌.. దోషులను శిక్షిస్తాం: సారథి

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:59 AM

ప్రతి పేదవాడికి గూడు నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

 గ్రీన్‌ విలేజ్‌.. దోషులను శిక్షిస్తాం: సారథి

కైకలూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): ప్రతి పేదవాడికి గూడు నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరులో గృహ నిర్మాణ పథకం ప్రగతిపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన గృహాలపై రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్‌ విచారణ జరిపించాం. అవకతవకలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవు. కైకలూరు గ్రీన్‌ విలేజ్‌లో మౌలిక వసతుల కొరకు రూ.6 కోట్లు కేటాయించాం. గ్రీన్‌ విలేజ్‌లో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి తెలిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. అలా వెళ్లేందుకు దమ్ము, దైర్యం కావాలి’ అని అన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 06:01 AM