Share News

AP Lorry Associations: గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గింపు జీవో విడుదల చేయాలి

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:29 AM

రాష్ట్రంలో సరుకు రవాణా వాహనాలకు గ్రీన్స్‌ ట్యాక్సు తగ్గిస్తూ, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవోను ఈనెలాఖరులోగా విడుదల చేయాలని న్యూ ఆంధ్ర మోటార్‌ ట్రక్కర్స్‌ అసోసియేషన్‌ (నమతా) ప్రతినిధులు రవాణా శాఖ కార్యదర్శిని కోరారు.

AP Lorry Associations: గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గింపు జీవో విడుదల చేయాలి

  • న్యూ ఆంధ్ర మోటార్‌ ట్రక్కర్స్‌ అసోసియేషన్‌

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సరుకు రవాణా వాహనాలకు గ్రీన్స్‌ ట్యాక్సు తగ్గిస్తూ, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవోను ఈనెలాఖరులోగా విడుదల చేయాలని న్యూ ఆంధ్ర మోటార్‌ ట్రక్కర్స్‌ అసోసియేషన్‌ (నమతా) ప్రతినిధులు రవాణా శాఖ కార్యదర్శిని కోరారు. సోమవారం అమరావతి సచివాలయంలో రవాణ, హాం శాఖల కార్యదర్శులను, నమతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ చలపతిరావు, సంయుక్త కార్యదర్శి శేషగిరి తదితరులు కలసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ‘ఆల్‌ ఇండియా పర్మిట్‌ కలిగిన ఏపీ వాహనాలపై ఇతర రాష్ట్రాల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. త్రైమాసిక పన్నుకు గ్రేస్‌ పీరియడ్‌ వర్తింపజేయకుండా ఏపీ లారీల యాజమానులపై కేసులు పెడుతున్నారు. త్రైమాసిక పన్నుకు సంబంధించి గ్రేస్‌ పిరియడ్‌ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో కేసులు రాయకుండా చూడాలి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి, ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో లారీ డ్రైవర్లకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి’ అని హోం కార్యదర్శికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 05:30 AM