Share News

రూ.1,216.60 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన సిగ్నల్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:51 PM

జిల్లాలో రూ.1,216.60 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్న టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ లిమిటెడ్‌ ఆధ్వరంలోని క్లాస్టిక్‌ సోడా, క్టోరోమిథేన్స-2 విస్తరణ, 70 మెగావాట్ల విద్యుత ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రూ.1,216.60 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన సిగ్నల్‌

టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో..

క్లాస్టిక్‌ సోడా, క్లోరోమిథెన్స-2 విస్తరణ

70 మెగా వాట్లా పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు

400 మందికి ఉద్యోగావకాశాలు

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

కర్నూలు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రూ.1,216.60 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్న టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ లిమిటెడ్‌ ఆధ్వరంలోని క్లాస్టిక్‌ సోడా, క్టోరోమిథేన్స-2 విస్తరణ, 70 మెగావాట్ల విద్యుత ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహాశుద్ధి శాఖ మంత్రి టీజీ భరతకు చెందిన పరిశ్రమ ఇది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం అమరావతిలో జరిగింది. 44 అజెండా అంశాలతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాదాపు రూ.9,500 కోట్లతో చేపట్టే 506 ప్రాజెక్టుల పరిపాలన అనుమతులకు కేబినేట్‌ గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది. అందులో ఒకటి టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ లిమిటెడ్‌కు చెందిన క్లాస్టిక్‌ సోడా, క్లోరోమిథేన విస్తరణ ఒకటి. కర్నూలు ప్రాంతం యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును విస్తరణకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా 400 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పటికే టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా పరిశ్రమ విస్తరణతో పాటు అదనంగా 70 మెగా వాట్లా విద్యుత ప్లాంట్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో మరింత మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమ విస్తరణ కోసం ప్రభుత్వం 30 శాతం పెట్టుబడి రాయితీ, పవర్‌ టారీఫ్‌ రీయింబర్స్‌మెంట్‌, ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్‌ ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఇటీవలే ఈ పరిశ్రమకు స్ట్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. తాజాగా కేబినేట్‌ గ్రీన సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలోనే విస్తరణ పనులు, విద్యుత ప్లాంట్‌ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.

ఫ పేదల ఇళ్లలో సోలార్‌ వెలుగులు

సూర్యఘర్‌ పథకం ద్వారా ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసి పేదల ఇళ్లలో సూర్యకాంతి వెలుగులు నింపాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక తయారు చేసింది. రెండు కిలోవాట్ల సోలార్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం ఇస్తున్న రాయితీ కాదని రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.20 వేలు రాయితీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాలో దాదాపు లక్ష కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి టీజీ భరత కోరారు.

Updated Date - Dec 11 , 2025 | 11:51 PM