Share News

Land Acquisition Protest: 8న కరేడులో రైతుల సమావేశానికి గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Sep 05 , 2025 | 06:40 AM

నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఇండోసోల్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు.. తమ సమస్యలపై చర్చిందుకునేందుకు సమావేశం...

Land Acquisition Protest: 8న కరేడులో రైతుల సమావేశానికి గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, ఉలవపాడు/కందుకూరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఇండోసోల్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు.. తమ సమస్యలపై చర్చిందుకునేందుకు సమావేశం జరుపుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల్లోగా ఈ సమావేశం జరుపుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ప్రశాంత వాతావరణంలో సభ జరిగేలా చర్యలు చేపట్టాలని, అవసరమైతే సభా కార్యక్రమాన్ని వీడియో తీసుకోవచ్చని పోలీసులకు సూచించింది. అదేవిధంగా 14న బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ పర్యటనకు కూడా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Updated Date - Sep 05 , 2025 | 06:40 AM