Share News

మహా జోష్‌..!

ABN , Publish Date - May 21 , 2025 | 11:16 PM

టీడీపీ శ్రేణుల పండుగ.. పసుపుదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుతమ్ముళ్ల సమ్మేళనం మహానాడు.

   మహా జోష్‌..!
ఎంపీతో కలిసి ఏర్పాట్లపై సమీక్షిస్తున్న జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి

నేడు జిల్లా స్థాయి మహానాడు

5 వేల మందితో నిర్వహించేలా సన్నాహాలు

జిల్లా అభివృద్ధిపై పలు తీర్మానాలు

ఏర్పాట్లను పర్యవేక్షించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు, మే 21 (ఆంధ్రజ్యోతి): టీడీపీ శ్రేణుల పండుగ.. పసుపుదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుతమ్ముళ్ల సమ్మేళనం మహానాడు. తెలుగునాట ఆరాధ్య నటుడు ఎన్టీఆర్‌ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాటి నుంచి తారకరాముడు జన్మదినమేన మే 28న మహానాడును ఓ పండుగలా నిర్వహిస్తు వస్తున్నారు. 43వ మహానాడు పండుగను ఈ నెల 27, 28, 29న కడప గడ్డపై ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. మహానాడుకు ముందు నియోజకవర్గాల కేంద్రాల్లో మినీ మహానాడు, జిల్లా మహానాడు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. నియోజకవర్గాల్లో చేసిన తీర్మానాలు జిల్లా మహానాడుకు పంపుతారు. ఆ తీర్మానాలు క్రోడీకరించి జిల్లా మహానాడులో తీర్మానం చేసి.. రాష్ట్ర మహానాడుకు పంపుతారు. నేడు కర్నూలు జిల్లా మహానాడును నందికొట్కూరు రోడ్డులోని కమ్మ సంఘం కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. నగరంలో రైల్వే స్టేషనరోడ్డు ఐదు రోడ్ల కూడలి, రాజ్‌ విహార్‌ సర్కిల్‌, కలెక్టరేట్‌ సర్కిల్‌, నంద్యాల చెక్‌పోస్ట్‌ సర్కిళ్లు టీడీపీ జెండాలతో పసుపు మయమయ్యాయి.

ఫ ముగిసిన మినీ మహానాడు నిర్వహణ:

మహా పండుగను పుష్కరించుకొని ఆదివారం కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాలు, మంగళవారం ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలు, బుధవారం పత్తికొండ నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇనచార్జీల ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు పండుగలు ఘనంగా నిర్వహించారు. తెలుగు తమ్ముళ్లలో జోష్‌, ఉత్తేజం నింపేలా నిర్వహించారు. అందుకు దీటుగా జిల్లా మహానాడును నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా 500 మందికిపైగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రుచికరమైన భోజనాలు వడ్డించనున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్‌, తెలుగుయువత నాయకుడు కేఈ రుద్రఫణీగౌడ్‌, న్యాయవాది ప్రసాద్‌ సహా పలువురు నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కందనవోలు ప్రగతిపై ఈ తీర్మానాలు చేయాలి

ఫ హైకోర్టు బెంచ ఏర్పాటుపై వేగవంతంగా అడుగులు వేయడంపై ధన్యావాదాలు, త్వరలోనే బెంచను ప్రారంభించాలి

ఫ ఓర్వకల్లు ఇండసి్ట్రయల్‌ కారిడార్‌కు అనుబంధంగా హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకురావాలి

ఫ జిల్లాలో టమోటా, ఉల్లి, పత్తి రైతులకు గిట్టుబాటు ధర, మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి.

ఫ పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసలు నివారణకు వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ, గుండ్రేవుల ప్రాజెక్టులు తక్షణమే చేపట్టాలి.

ఫ పులికనుమ జలాశయం 1.75 టీఎంసీలు నుంచి 3 టీఎంసీలకు సామర్థ్యం పెంచుతూ తుంగభద్ర నుంచి అదనపు పైపులైన వేయాలి.

ఫ హంద్రీనీవా కాలువకు 18 ప్రాంతాల్లో తూములు ఏర్పాటు చేసి అదనంగా 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి.

ఫ కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి.

ఫ కర్నూలు నగరం స్మార్ట్‌సిటీగా అభివృద్ధికి తక్షణ కార్యచరణ అమలు పరచాలి

ఫ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్‌కు నిధులు ఇచ్చి పనులు చేపట్టాలి.. ప్రతి ఇంటికి కొళాయి సౌకర్యం కల్పించాలి.

ఫ బాదుడే బాదుడు సభల్లో అధినేత చంద్రబాబు, యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేశ ఇచ్చిన హామీ అమలుకు తక్షణ చర్యలు చేపట్టాలి.

ఫ ఆదోని నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న ఆదోని మెడికల్‌ కాలేజీ పనులు చేపట్టాలి, ఆదోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనాలు నిర్మాణాలు చేపట్టాలి.

ఫ ఇల్లు లేని పేదలకు 3 సెంట్లు ఇంటి పట్టా, ఎన్టీఆర్‌ పక్కా ఇల్లు నిర్మాణం, ఏపీ టిడ్కో ఇళ్లు తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలి.

ఫ కేసీ కాలువ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టాలి.

ఫ అసంపూర్తిగా ఆగిపోయిన ఉర్దూ విశ్వవిద్యాలయం, క్లస్టర్‌ యూనివర్సిటీ, రాయలసీమ వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ శాశ్వత భవనాలు పనులు మొదలు పెట్టి పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.

ఫ మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి క్షేత్రం, ఉరుకుంద శ్రీలక్ష్మినరసింహాస్వామి క్షేత్రం, ఎల్లార్తి క్షేత్రాలను కలుపుతూ టూరిజం సర్య్కూట్‌ ఏర్పాటుకు చేయాలి.

ఫ కర్నూలు సర్వజన వైద్యశాల, మెడికల్‌ కాలేజీ అసంపూర్తి భవనాలు పూర్తి చేయాలి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

ఫ ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత టీడీపీలో చేరిన వైసీపీ నాయకులకు కాకుండా.. ఐదేళ్లు ప్రతిపక్షంలో పార్టీ కోసం ప్రాణాలొడ్డిన, శ్రమించిన టీడీపీ శ్రేణులకే నామినేటెడ్‌ పదవులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలి.

ఫ పకడ్భందీగా జిల్లా మహానాడు

- పి.తిక్కారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

టీడీపీ కార్యకర్తల పండుగ మహానాడు. నా ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి జిల్లా మహానాడు ఇది. పకడ్భందీగా, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు సహా పార్టీ ముఖ్యనాయకులు హాజరవుతారు. 5 వేల మందికిపైగా రావచ్చని అంచనా వేసి ఆ మేరకు వసతి, భోజన ఏర్పాట్లు చేశాం. కడపలో జరిగే మహానాడుకు ముందు నిర్వహించే పడుగ ఇది. ప్రజా ప్రతినిధులు, నాయకులు సమష్టి కృషితో విజయవంతం చేస్తాం. జిల్లా అభివృద్ధి కాంక్షిస్తూ దాదాపుగా 20 తీర్మానాలు చేసి మహానాడుకు పంపుతాం.

Updated Date - May 21 , 2025 | 11:16 PM