Share News

Giri Pradakshina at Annavaram: వేడుకగా సత్యదేవుడి గిరిప్రదక్షిణ

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:55 AM

కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం సత్యదేవుడి గిరిప్రదక్షిణ వేడుకగా జరిగింది. కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన గిరిప్రదక్షిణలో...

Giri Pradakshina at Annavaram: వేడుకగా సత్యదేవుడి గిరిప్రదక్షిణ

  • పాల్గొన్న 2 లక్షలమంది భక్తులు

అన్నవరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం సత్యదేవుడి గిరిప్రదక్షిణ వేడుకగా జరిగింది. కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన గిరిప్రదక్షిణలో సుమారు 2 లక్షల మంది పాల్గొన్నారు. తొలిపావంచా నుంచి జాతీయ రహదారి మీదుగా బెండపూడి సమీపంలో పుష్కరకాలువ రోడ్డుమీదుగా సుమారు 8.5 కిలోమీటర్లమేర గిరియాత్ర సాగింది. సుమారు 700 మంది పోలీసులు, ఆరుగురు తహసీల్దార్లు, 20మంది వీఆర్వోలు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి పంపాహారతుల కార్యక్రమం జరిగింది.

Updated Date - Nov 06 , 2025 | 02:55 AM