ఘనంగా నృసింహస్వామి గరుడోత్సవం
ABN , Publish Date - May 11 , 2025 | 11:21 PM
Grand celebration of Lord Narasimha Swamy and Garuda
ఆళ్లగడ్డ, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహో బిలంలో నృసింహస్వామి జయంతి బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ఎగువ, దిగువ అహోబిల దేవాల యాలు భక్తులతో కిటకిటలాడాయి. వేదపండితులు కిడాంబి వేణుగో పాలన స్వామి, మణియర్ సౌమ్యనారాయణన ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీసుదర్శన చక్రరాజ స్వామికి 108 కలశాలతో విశేష తిరుమంజనం నిర్వహించారు. దేవస్థానం వేదపండితు లు వేణుగోపాలస్వామి ఆద్వర్యంలో వేద మంత్రాల నడుమ శాసో్త్రక్తంగా పూజలు నిర్వహించారు. ఎగువ అహోబిలంలో కూడా నరసింహ జయంతి స్వాతి పర్వదినం సందర్భంగా శ్రీ జ్వాలా నరసింహాస్వామి చెంచులక్ష్మి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం మేనేజర్ మాధవన, మనియర్ సౌమ్యనారాయణ, అర్చకులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలకు ఆళ్లగడ్డకు చెందిన హిమబిందు, రవికాంతచౌదరి, తాడికొండకు చెందిన మంగళ రాజ్య లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, అహోబిలం మఠం సంత శఠగోపన ఉభయదారులుగా వ్యవహరించారు.