Karthika Pournami: శ్రీశైలంలో వైభవంగా జ్వాలా తోరణం
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:52 AM
శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు...
శ్రీశైలం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్షేత్రం కిటకిటలాడింది. తెల్లవారుఝాము నుంచే నదిలో పుణ్యస్నానాలు చేసి, ఆలయ ప్రధాన వీధిలో దీపాలు వెలిగించారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, బుధవారం రాత్రి ఆలయంలో లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.