ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి యూరియాపై ఆందోళనలా..: నాదెండ్ల
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:28 AM
ఆపధర్మ సీఎంగా జగన్ ఉన్న సమయంలోనే ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల సమస్యలు...
ఏలూరు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘ఆపధర్మ సీఎంగా జగన్ ఉన్న సమయంలోనే ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల సమస్యలు, యూరియాపై ఆర్డీవో కార్యాలయాలను ముట్టడిస్తారు?’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఎరువుల సరఫరాపై ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలను చెల్లించిందని గుర్తు చేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపడుతున్నామన్నారు.