AP Govt: నీటి పన్ను బకాయిలపై 85 కోట్ల వడ్డీ మాఫీ
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:46 AM
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీటిపన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటితీరువా బకాయిలు ఇప్పటివరకు రూ.450 కోట్లపైనే ఉంటాయి.
అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీటిపన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటితీరువా బకాయిలు ఇప్పటివరకు రూ.450 కోట్లపైనే ఉంటాయి. వీటిని రైతులు ఏటేటా చెల్లింస్తుండాలి. కొన్నేళ్లుగా వసూళ్లు సజావుగా సాగడం లేదు. 2024-25 నాటికి రైతులు చెల్లించాల్సిన వడ్డీ రూ.85.81 కోట్లు ఉంది. అయితే దీన్ని మాఫీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖ చేసిన వడ్డీ మాఫీ ప్రతిపాదనను మంత్రివర్గ భేటీలో ఆమోదించారు. ఆ మాఫీని అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మీ గురువారం ఉత్తర్వులిచ్చారు.