Governor Najir: వైద్యుల చేతుల్లోనే ప్రజల ఆరోగ్యం
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:06 AM
ప్రజల ఆరోగ్యం వైద్యుల చేతుల్లోనే ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. వర్ధమాన వైద్యులు నూతన మెలకువలను నేర్చుకుంటూ ఈ రంగాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించారు..
ఎన్టీఆర్ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ నజీర్
విజయవాడ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యం వైద్యుల చేతుల్లోనే ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. వర్ధమాన వైద్యులు నూతన మెలకువలను నేర్చుకుంటూ ఈ రంగాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27, 28వ స్నాతకోత్సవాన్ని విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పతకాలు, ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేశారు. ఢిల్లీకి చెందిన నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఓపీ యాదవ్‌కు ఎన్టీఆర్ వర్సిటీ డాక్టరేట్‌ను అందజేసింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వైద్య విజ్ఞానంలో పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా మెలకువలను పెంచుకోవాలని సూచించారు. వైద్యరంగంలో రాష్ట్రం మంచి పురోగతిని సాధించిందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.