Governor Abdul Nazeer: హక్కుల రక్షణలో రాజ్యాంగానిది కీలక పాత్ర
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:23 AM
ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు...
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ మసాయిదా కమిటీ సభ్యుల చిత్రపటాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రథమ మహిళ సమీరా నజీర్, సీఎస్ కె.విజయానంద్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు పాల్గొన్నారు.
రాజ్యాంగ విలువలను గౌరవించాలి: జెన్కో ఎండీ నాగలక్ష్మి
రాజ్యాగం విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని జెన్కో ఎండీ నాగలక్ష్మి పేర్కొన్నారు. విద్యుత్ సౌధలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ట్రాన్స్‌కో డైరెక్టర్లు, జెన్కో డైరెక్టరు పాల్గొన్నారు. ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని రాజ్యాంగ దినోత్సవంలో సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, షరీఫ్, మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, తెనాలి శ్రావణ్, ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేపాడ చిరంజీవి, బీద రవిచంద్ర పాల్గొన్నారు.