Share News

GUNADHALA CHURCH LIGHTING: గవర్నర్‌, సీఎం, పవన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:47 AM

క్రైస్తవులకు గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఏసుక్రీస్తును సంతోషంగా స్మరించుకునే...

GUNADHALA CHURCH LIGHTING: గవర్నర్‌, సీఎం, పవన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): క్రైస్తవులకు గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఏసుక్రీస్తును సంతోషంగా స్మరించుకునే, ప్రజలందరిలో క్షమాగుణం, ఐక్యత, ప్రేమ, దయ, కరుణ, దాతృత్వాన్ని వ్యాప్తి చేసే సమయమని గవర్నర్‌ పేర్కొన్నారు. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకొనే క్రిస్మస్‌ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారందరికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హృదపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దయా గుణాన్ని ఇతరులకు పంచడమే ఏసుక్రీస్తు సందేశమని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

4,427 మంది పాస్టర్లకు 50.04 కోట్లు జమ

పాస్టర్లకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్‌ కానుక అందించింది. వారికి నెలవారీ అందించే గౌరవ వేతనం జమ చేసింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 8,427 మంది పాస్టర్లకు గౌరవ వేతనాన్ని బుధవారం వారి ఖాతాల్లో జమ చేశారు. 2024 డిసెంబరు నుంచి ఈ ఏడాది నవంబరు వరకు మొత్తం రూ.50.04 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల ఖాతాల్లో వేసింది. దీంతో ఒక్కో పాస్టర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి 12 నెలల మొత్తం రూ.60 వేలు అందించింది. క్రిస్మస్‌కి ఒక రోజు ముందే పాస్టర్ల అకౌంట్లకు గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 04:47 AM