Governor Abdul Nazeer: క్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం : గవర్నర్
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:13 AM
క్రిస్మస్ అనేది దయ, ప్రేమను బోధించి, ఏసుక్రీస్తును స్మరించుకునే మంచి సమయమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు...
లోక్‌భవన్‌లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ అనేది దయ, ప్రేమను బోధించి, ఏసుక్రీస్తును స్మరించుకునే మంచి సమయమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. మంగళవారం లోక్‌భవన్‌లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సద్గుణాలతో జీవితాన్ని కొనసాగించాలని ఆయన అందరికీ తెలియజేశారన్నారు. తొలుత షామ్‌రాక్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్థులు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. అనంతరం గవర్నర్ క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి, పిల్లలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీ పీఎస్ సూర్యప్రకాశ్, లోక్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.