Share News

Governor Abdul Nazeer: నాగార్జున కొండను సందర్శించిన గవర్నర్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 02:56 AM

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు...

Governor Abdul Nazeer: నాగార్జున కొండను సందర్శించిన గవర్నర్‌

విజయపురిసౌత్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. తెలంగాణలోని హిల్‌ కాలనీకి గవర్నర్‌ చేరుకోగా హెలిప్యాడ్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘనస్వాగతం పలికారు. అనంతరం పర్యాటక శాఖ లాంచీలో గవర్నర్‌ నాగార్జున కొండకు చేరుకున్నారు. నాగార్జున కొండ చరిత్రను మ్యూజియం క్యూరేటర్‌ కమల్‌హాసన్‌ వివరించారు.

Updated Date - Oct 19 , 2025 | 02:56 AM