MBBS Cheating Siddhartha College: ఎంబీబీఎస్‌లో కాపీయింగ్‌పై చర్యలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:15 AM
సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పరీక్షల్లో కాపీయింగ్‌పై ప్రభుత్వం కఠినంగా స్పందించింది. కాలేజీ సిబ్బంది సహకారంతో విద్యార్థులు చీటింగ్ చేసినట్లు నివేదికలో వెల్లడి

సిద్ధార్థ కాలేజీ సిబ్బంది సహకారంతోనే అంతా!
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కాపీయింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఈ కాలేజీలో బుధవారం జరిగిన ఎంబీబీఎస్ చివరి, రెండో సంవత్సర విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయారు. కాపీయింగ్ వ్యవహారాన్ని వర్సిటీ రిజిస్ట్రార్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ వెలుగులోకి తెచ్చారు. పదుల సంఖ్యలో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడగా.. ముగ్గురు మాత్రమే దొరికారు. మిగిలిన విద్యార్థులంతా తప్పించుకున్నారు. ఈ వ్యవహారంపై వర్సిటీ రిజిస్ట్రార్ గురువారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు నివేదిక ఇచ్చారు. కాలేజీ సిబ్బంది సహకారంతోనే విద్యార్థులు కాపీయింగ్ పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కాలేజీ ప్రిన్సిపల్, కొంతమంది ప్రొఫెసర్లు, కీలకంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు డీఎంఈ సిద్ధమయ్యారు. మరోవైపు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చాలా ఏళ్ల నుంచి కాపీయింగ్ వ్యవహారం నడుస్తోందని, ఇదంతా కార్యాలయ సిబ్బంది సహకారంతోనే జరుగుతోందని నిర్థారణకు వచ్చారు. శుక్రవారం ఎంతమందిపై వేటు పడుతుందో చూడాలి.