ఆటో డ్రైవర్లకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:34 PM
దసరా పండుగకు ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి కూటమి ప్ర భుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే గిత్తా జ యసూర్య అన్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య
ఆటో డ్రైవర్లతో పట్టణంలో భారీ ర్యాలీ
నందికొట్కూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగకు ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి కూటమి ప్ర భుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే గిత్తా జ యసూర్య అన్నారు. శనివారం పట్టణ శివారు లో ని ‘ఆటో డ్రైవర్ల సేవ’లో కార్యక్రమంలో భాగంగా జమ్మిచెట్టు వద్ద నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి చాముండి ఫంక్షన హాల్ వరకు ఆటోలో చేరుకున్నారు. స మావేశంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మా ట్లాడుతూ స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆటో కా ర్మికుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న విషయాన్ని గమనించిన కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచేందుకు ‘ఆటో డ్రైవర్ల సేవ’లో పథకాన్ని తీసుకవచ్చిందన్నారు. నందికొట్కూరు నియోకవర్గంలోని ఆరు మండలాల్లో 1637 కుటుంబాలకు రూ.2,54,55,000 నగదు ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమ అయ్యిందన్నారు. నందికొట్కూరు మండలంలో 577 మంది లబ్ధిదారులకు రూ.86,55,000, పగిడ్యాల మండలంలో 177 మందికి రూ.26,55,000, మిడ్తూరు మండలంలో 276 మందికి 41,40,000, జూపాడుబంగ్లాలో 239 మందికి 33,85,000, పాములపాడు మండలంలో 225 మందికి రూ.33,75,000, కొత్తపల్లి మండలంలో 203 మందికి రూ.30,45,000 నగదును లబ్ధిదారులు పొందా రన్నారు. కాగా, సమావేశం జరుగుతుండగానే ప్రభుత్వం నుంచి తమ ఖాతాలో రూ.15 వేలు జమ అయ్యాయని ఆటో కార్మికులు ఎమ్మెల్యేకు మెసేజ్‌లను చూపించారు. సమావేశంలో నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన వీరంప్రసాద్‌రెడ్డి, టీడీపీ పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు దేవళ్ల మురళీ, యాదవ కార్పొరేషన డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, సొసైటీ చైర్మన్లు ముర్తుజావళి, మద్దూరు సర్వోత్తంరెడ్డి, నందికొట్కూరు, కొత్తపల్లి, జూపాడుబంగా, పగిడ్యాల మండల కన్వీనర్లు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, లింగస్వామిగౌడ్, గుండ్రెడ్డి మోహనరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.