కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:57 PM
కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుమన, మధుబాబు అన్నారు.
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుమన, మధుబాబు అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని రాముడు అధ్యక్షతన రెవెన్యూ భవనలో కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సెర్ఫ్, మెప్మా ఉద్యోగుల మాదిరిగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచఆర్ అమలు చేయాలన్నారు. సీనీయారిటీ ప్రాతిపదికన కనీస సర్వీసు నిబంధన పెట్టి, సంవత్సరం లేదా కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి అదనపు బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అనంతరం జేఏసీ కర్నూలు జిల్లా చైర్మన కేవై కృష్ణ మాట్లాడుతూ ఏపీ జేఏసీ అమరావతి కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో రామ్ భద్ర చారి, నాగరాజు, అమీదాబి, శ్రీధర్, సంధ్య, సరస్వతి, సోమన్న, సరోజ, సావిత్రి, యశోద పాల్గొన్నారు.