Vangalapudi Anitha: క్రీడలకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:11 AM
కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
హోం మంత్రి వంగలపూడి అనిత
మంగళగిరిలో జాతీయ స్థాయి పోలీస్ వెయిట్ లిఫ్టింగ్, యోగా పోటీలు ప్రారంభం
మంగళగిరి సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, యోగా పోటీలను మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో సోమవారం ఉదయం ఆమె ప్రారంభించారు. తొలుత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శాంతి కపోతాలు, బెలూన్లను ఎగురవేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ పోలీసు సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా, డీఐజీ కేకేఎన్ అంబురాజన్, స్పోర్ట్స్ ఐజీ కేవీ మోహనరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.