STU President Sai Srinivas: ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:10 AM
కూటమి అధికారం చేపట్టి 14 నెలలైనా మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదార్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని రాష్ర్టోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్...
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్
విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కూటమి అధికారం చేపట్టి 14 నెలలైనా మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదార్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని రాష్ర్టోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్టీయూ ప్రాంతీయ సమావేశం శనివారం విశాఖలో జరిగింది. సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్‌సీ అమలు, మధ్యంతర భృతి, బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కూటమి వాటిని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. స్కూలు అసిస్టెంట్లకు ఎంఈవో-1 బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి మాట్లాడుతూ గత పది నెలలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులు జరగడం లేదన్నారు.