Share News

Revenue Department: ప్రభుత్వ భూముల లెక్క తేల్చండి

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:47 AM

రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎన్ని? రికార్డుల ప్రకారం 2014-19 కాలంలో ఏ మేరకు ఉన్నాయి? 2019-24లో వాటి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మొత్తం ప్రభుత్వ భూములు ఏ మేరకు ఉన్నాయి? ఏ శాఖ పరిధిలో ఎంత భూమి ఉంది?..

Revenue Department: ప్రభుత్వ భూముల లెక్క తేల్చండి

  • రెవెన్యూ శాఖ నియంత్రణలో ఎన్ని?

  • ఆయా శాఖల పరిధిలో ఏ మేరకు?

  • గ్రామాల వారీగా స్పష్టత ఇవ్వండి

  • సమగ్ర సర్వేలో తొలి ప్రాధాన్యం వీటికే

  • అధికారులకు రెవెన్యూ శాఖ ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎన్ని? రికార్డుల ప్రకారం 2014-19 కాలంలో ఏ మేరకు ఉన్నాయి? 2019-24లో వాటి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మొత్తం ప్రభుత్వ భూములు ఏ మేరకు ఉన్నాయి? ఏ శాఖ పరిధిలో ఎంత భూమి ఉంది?.. వెంటనే స్పష్టమైన లెక్కలు తీయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. గ్రామాల వారీగా ప్రభుత్వ భూముల లెక్క తీయాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం చేపట్టిన భూముల సమగ్ర సర్వేలో తొలి ప్రాధాన్యం ప్రభుత్వ భూములకే ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. అధికారిక లె క్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కోటిన్నర సర్వే నంబర్ల పరిధిలో 3,40,23,510 ఎకరాల భూమి ఉంది. ఇదంతా వెబ్‌ల్యాండ్‌ ఆర్‌ఎ్‌సఆర్‌లో నమోదైంది. ఇందులో ప్రభుత్వ భూమి నికరంగా 55.78 లక్షల ఎకరాల మేర ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రెవెన్యూ, పోరంబోకు, కొండపోరంబోకు, చుక్కల భూములు, ఇనాం, ఎస్టేట్‌, గ్రామకంఠం భూములు ఇందులో ఉన్నాయి. ఇవికాకుండా దేవదాయ భూములు మరో 4.48 లక్షల ఎకరాలు ఉన్నాయి. గత జగన్‌ ప్రభుత్వం 2020 నుంచి 2024 వరకు భూముల సర్వే చేపట్టింది. అసైన్డ్‌ భూముల చట్టం(పీఓటీ)-1977ను సవరించి 20 ఏళ్ల గడువు తీరిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి హక్కుదారులకు శాశ్వత హక్కులు(ఫ్రీ హోల్డ్‌) కల్పించిన సంగతి తెలిసిందే. 13.5 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్‌ చేస్తే అందులో 5.75 లక్షల ఎకరాలను చట్టవిరుద్ధంగా చేశారని గుర్తించారు. ఒక్క అసైన్డ్‌ భూముల విషయంలోనే ఇంతగా అక్రమాలు జరిగితే, రీ సర్వే పేరిట మరెన్ని తప్పులు జరిగి ఉంటాయోనని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది.


ఈ నేపథ్యంలో తొలుత ప్రభుత్వ భూముల లెక్క తీయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. 2014-19 కాలంలో, ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వంలో, ఇప్పుడు మూడు విడతల్లో ఉన్న ప్రభుత్వ భూ ముల లెక్క తీసి గణాంకాలను పరిశీలించాలని ప్రభు త్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. రెవెన్యూ శాఖ నియంత్రణలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూములు ఎన్ని? ఆయా శాఖల పరిధిలో ఉన్న భూమి ఎంతో లెక్క తీయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. అలాగే, ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న భూమి వివరాలపై సమగ్ర వివరాలు అందించాలని సంబంధిత అధికారులను రెవెన్యూ శాఖ లిఖితపూర్వకంగా కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే జరుగుతున్న సంగ తి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల డేటాను తాజా పరచాలని సర్కారు భావిస్తోంది. తొలుత ప్రభుత్వ భూముల సర్వేను పూర్తి చేయాలని సర్వే శాఖ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదే శించినట్లు తెలిసింది. గ్రామాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలపై స్పష్టత వస్తే, ప్రైవేటు భూముల సర్వేను కొనసాగించనున్నారు. రెండో దశ రీ సర్వేలో ఇదే కీలకాంశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ భూమి వినియోగమార్పిడి చట్టం(నాలా)ను ప్రభుత్వం త్వరలో ఉపసంహరించనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను కాపాడటం ఎలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీన్ని దృషి ్టలో ఉంచుకొని ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురికాకుండా, అక్రమ లే అవుట్‌లు వేసి అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు వెబ్‌ల్యాండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. గ్రామాల వారీగా లెక్క తేలిన ప్రభుత్వ భూములన్నింటిని రెడ్‌మార్కింగ్‌లో వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తారు. ఆ భూములపై లావాదేవీలను నిషేధిస్తారు. దీంతో ఆ భూముల రిజిస్ట్రేషన్‌లు జరగవు.

Updated Date - Jul 20 , 2025 | 04:51 AM