మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:51 PM
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని జిల్లా డీఆర్డీఏ-పీడీ రమణారెడ్డి అన్నారు.

కల్లూరు, ఏప్రిల్ 11 (ఆంద్రజ్యోతి): మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని జిల్లా డీఆర్డీఏ-పీడీ రమణారెడ్డి అన్నారు. శుక్రవారం తడకనపల్లె గ్రామాన్ని ఆయన సందర్శించి 2025-26 సవంత్సరానికి సెర్ప్ ద్వారా ఆర్థిక ప్రణాళికను ఎన్యూమరేటర్ల ద్వారా గ్రామ సంఘాల్లో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పీడీ రమణారెడ్డి మాట్లాడుతూ మహిళలు వివిధ రకాల జీవనోపాధుల్ని చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి పథంలో పయనించాలన్నారు. అధికారులతో కలిసి గ్రామసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీవనోపాధులను పరిశీలించారు. తడకనపల్లె గ్రామంలో పాలకోవ కేంద్రాలు, సోలార్ డ్రైయ్యర్లు, పశువసతి కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. మహిళలు ఆనిధులను సక్రమంగా ఉపయోగించుకుని జీవనోపాధులు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐబి.డీపీఎం హజరత, ఏసీ రెహమాన, మండల సమాఖ్య అధ్యక్షురాలు జుబేదాభి, ఏపీఎం పుష్పావతి, సీసీలు, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు.