Palla Srinivasa Rao: నేడు, రేపు ప్రజల సేవలో ప్రభుత్వం
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:41 AM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులన్నీ ‘ప్రజల సేవలో ప్రభుత్వం ....
పండుగలా నిర్వహిద్దాం: టీడీపీ నేతలకు పల్లా పిలుపు
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులన్నీ ‘ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమాన్ని డిసెంబరు 31, జనవరి 1న పండుగలా నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. టీడీపీ నాయకులతో మంగళవారం ఆయన టెలికాన్ఫ్‌రెన్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఉందని పల్లా అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త రెండు రోజులపాటు ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వం సాధించిన విజయాలను, చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ఒక పండుగలా ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి ముఠా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని, దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పల్లా పిలుపునిచ్చారు.