ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:09 PM
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈ) అధ్యక్షుడు ఎస్.ఇస్మాయిల్, అసోసియేట్ ప్రెసిడెంట్ బాలక్రిష్ణంరాజు తెలిపారు.
రైల్వేకోడూరు, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈ) అధ్యక్షుడు ఎస్.ఇస్మాయిల్, అసోసియేట్ ప్రెసిడెంట్ బాలక్రిష్ణంరాజు తెలిపారు. శనివారం రైల్వేకోడూరు పట్టణంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ, డీఏలు, అరియర్స్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన 5న చలో విజయవాడ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యదర్శి గల్లా రమణ, వైస్ ప్రెసిడెంట్ గురుమహేష్ తదితరులు పాల్గొన్నారు.