అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:13 AM
అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
నందికొట్కూరు రూరల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మండలంలోని అల్లూరు గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతుసేవాకేంద్రం, గ్రామ ఆరోగ్యకేంద్రం భవనాలను సోమవారం టీడీపీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఇనచార్జి మాండ్ర శివానందరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో మంచినీటి పైప్‌లైనకు భూమిపూజ నిర్వహించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీతారామాలయానికి మాండ్ర శివానందరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే జయసూర్యలు భూమి పూజ నిర్వహించారు. గ్రామ సచివాలయంవద్ద స్మార్ట్ రేషన కార్డులను తహసీల్దారు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ గిరీష్, పీఆర్‌డీఈ శ్రీనివాసరెడ్డి, ఏవో షేక్షావలి, అల్లూరు సర్పంచ చిన్న నాగలక్ష్మయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన ప్రసాదరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథరెడ్డి, నాయకులు వెం కటేశ్వర్లు, చల్లాదామోదరెడ్డి, మద్దూరు హరిసర్వోత్తమరెడ్డి, ఖాతా రమేష్‌రెడ్డి, ఖలీలులాబేగ్, పలుచాని మహేశ్వరెడ్డి, రవీంద్రనాయుడు పాల్గొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ
మిడుతూరు: మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో దశరథరామయ్య, డిప్యూటీ ఎంపీడీవో సంజన్న, సర్పంచు జయలక్షమ్మ టీడీపీ మండల కన్వీనర్లు కాతా రమేష్ రెడ్డి, మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పలుచాని మహేశ్వర రెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సుధాకర్, వివిధ గ్రామాల టిడీపీ నాయకులు పాల్గొన్నారు.