AP Govt: మద్యం స్కాం కేసులో కసిరెడ్డి ప్రాసిక్యూషన్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:56 AM
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిపై సిట్ ఉచ్చు బిగిస్తోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్ ఐటీ సలహాదారుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఐటీ సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతభత్యాలు
దీంతో ప్రాసిక్యూట్ చేయడానికి సర్కారు అనుమతి తప్పనిసరి
ఈ దిశగానే కూటమి ప్రభుత్వం నిర్ణయం
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిపై సిట్ ఉచ్చు బిగిస్తోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్ ఐటీ సలహాదారుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ రాజ్‌ను అరెస్టు చేసింది. ఆయన ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్నందున ఆయన్ను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించాలి. లేదంటే న్యాయపరంగా చిక్కుముడు లు ఎదురయ్యే అవకాశముంది. దీంతో వీటిని అధిగమించేందుకు వీలు గా ఆయనపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సోమవా రం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. సంబంధిత ఉత్తర్వు బహిర్గతం కాకపోయినా.. చట్టపరంగా రాజ్ కసిరెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మద్యం స్కాం కేసు దర్యాప్తు మందకొడిగా సాగుతోందని.. వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతున్న తరుణంలో.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.