Government Allows Re Appointment: రిటైర్డ్ ఉద్యోగులకు మరో అవకాశం
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:10 AM
ప్రభుత్వంలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను రీ అపాయింట్‌మెంట్ పేరుతో తిరిగి సర్వీస్ లోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం..
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రీ-అపాయింట్‌మెంట్
అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను రీ-అపాయింట్‌మెంట్ పేరుతో తిరిగి సర్వీస్ లోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తిరిగి రీ-అపాయిమెంట్ చేసి, వారి సేవలు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.