గూగుల్ అంటే... గుడ్లు, బొబ్బట్లు పరిశ్రమ కాదు: విప్ యార్లగడ్డ
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:55 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో గుడ్లు, బొబ్బట్లు పరిశ్రమలు తెస్తే ... టీడీపీ ప్రతిష్ఠాత్మకమైన గూగుల్‌ను తీసుకొచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెం కట్రావు అన్నారు.
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో గుడ్లు, బొబ్బట్లు పరిశ్రమలు తెస్తే ... టీడీపీ ప్రతిష్ఠాత్మకమైన గూగుల్‌ను తీసుకొచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం టీడీపీ ప్రధాన కా ర్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.50 లక్షల నుండి 1.80 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ కేంద్రం ఏర్పాటు వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. గూగుల్ డేటా సెంటర్ అంటే కోళ్ల ఫారం షెడ్డు అనుకుంటున్నట్లున్నారు. జగన్ పార్టీ నేతలు విరక్తితో మాట్లాడుతున్నట్లున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుపై జగన్ తన వైఖరి ఏమిటో ప్రజలకు చెప్పాలి. డేటా సెంటర్ ప్రయోజనాలపై గుడ్డు, గంట, అరగంట నాయకులు కాకుండా వైసీపీలో ఐటీ నిపుణులతో చర్చకు నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు.